డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజయం
పంబాజ్‌లోని మొహాలీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టును విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 191/5 స్కోరు చేసింది. రాజపక్సే హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో శామ్ కర్రన్ 17 బంతుల్లో 26 పరుగులు చేయడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. జితేష్ శర్మ 11 బంతుల్లో 21 పరుగులు, సికిందర్ రాజా 13 బంతుల్లో 16 పరుగులు చేసి వెనుతిరిగారు.
ఏడు పరుగుల తేడాతో పంజాబ్ విజయం
లక్ష్య చేధనకు దిగిన కోల్ కతా జట్టుకు శుభారంభం లభించలేదు. అర్షదీప్ సింగ్ ఓకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంలో కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది మనుదీప్ షింగ్, అనుకుల్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ త్వరగా పెవిలియానికి చేరారు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వెంకటేష్ అయ్యర్, రస్సెల్ జట్టును అదుకొనే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కేకేఆర్ 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ను ఆంపైర్లు నిలిపివేశారు. మ్యాచ్ తిరిగి నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్ ఏడు పరుగులు తేడాతో గెలిచినట్లు ఆంపైర్లు ప్రకటించారు.