
SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్ టోర్నమెంట్ చివర్లో శుభారంభం లాంటి ముగింపు ఇచ్చింది.
సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి తప్పుకుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 278/3 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చిన అనంతరం, హెన్రిచ్ క్లాసెన్ అజేయ సెంచరీతో (105*) అసాధారణ ప్రదర్శన చేశాడు.
Details
చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు
దీంతో సన్‌రైజర్స్ మరోసారి భారీ స్కోరును సాధించింది. అటు 279 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు 168 పరుగులకే కుప్పకూలింది.
బ్యాటింగ్‌లో మనీశ్ పాండే (37), హర్షిత్ రాణా (34), సునీల్ నరైన్ (31) పోరాడినా చాలలేదు.
హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో జయ్‌దేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే తలా మూడు వికెట్లు తీసి కోల్‌కతా బ్యాటింగ్‌ను దెబ్బతీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సెంచరీతో చెలరేగిన క్లాసన్
Breathtaking and Belligerent 🫡
— IndianPremierLeague (@IPL) May 25, 2025
Describe Heinrich Klaasen's second #TATAIPL 💯 in one word 👇
Scorecard ▶ https://t.co/4Veibn1bOs #SRHvKKR | @SunRisers pic.twitter.com/HOIgoCYtTO