LOADING...
Koneru Humpy: మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి హంపి గుడ్‌బై..కారణం ఏంటంటే?
మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి హంపి గుడ్‌బై..కారణం ఏంటంటే?

Koneru Humpy: మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి హంపి గుడ్‌బై..కారణం ఏంటంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Mar 23, 2026
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశానికి చెందిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ టోర్నమెంట్ ఈ నెల 28న సైప్రస్‌లోని పఫోస్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. వ్యక్తిగత భద్రతపై ఉన్న ఆందోళనల వల్ల హంపి ఈ పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

వివరాలు

అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నా..

పూర్తిగా ఆలోచించిన తర్వాత ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నానని కోనేరు హంపి అన్నారు. ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ ఎంత ముఖ్యమైనదైనా, వ్యక్తిగత భద్రతకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్వాహకులు భద్రతపై హామీలు ఇచ్చినా, ప్రస్తుత పరిస్థితుల్లో తనకు నమ్మకం కలగడం లేదన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అయినప్పటికీ, తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చిందని హంపి వెల్లడించింది. క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనను హంపి ఇప్పటికే ముందుగా వెల్లడించింది. కాగా పురుషుల, మహిళల క్యాండిడేట్స్ టోర్నీలు రెండూ సైప్రస్‌లో ఒకేసారి నిర్వహించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్: 

Advertisement