LOADING...
Rinku Singh: రింకూ సింగ్‌కు కుల్దీప్ చెంపదెబ్బ.. నెట్టింట్లో వీడియో వైరల్!
రింకూ సింగ్‌కు కుల్దీప్ చెంపదెబ్బ.. నెట్టింట్లో వీడియో వైరల్!

Rinku Singh: రింకూ సింగ్‌కు కుల్దీప్ చెంపదెబ్బ.. నెట్టింట్లో వీడియో వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్-2025 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన కేకేఆర్‌ సత్తా చాటింది. అయితే మ్యాచ్ అనంతరం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటున్న సమయంలో ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్‌కి చెంపదెబ్బ కొట్టాడు. మొదటిసారి అది సరదాగా అనిపించినా, రెండోసారి కూడా అదే విధంగా చేయడంతో రింకూ కాస్త అసహనం వ్యక్తం చేశాడు.

Details

కుల్దీప్ యాదవ్ పై మండిపడుతున్న అభిమానులు

ఈ సంఘటన లైవ్ స్ట్రీమింగ్‌లో రికార్డయిన వీడియో ద్వారా బయటపడింది. ప్రస్తుతం ఆ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సీనియర్ ఆటగాడు అయిన కుల్దీప్‌ ఇలా ప్రవర్తించడాన్ని పలువురు అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. 'ఇంతటి అనుచిత ప్రవర్తన ఏంటి?' అంటూ అతడిపై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా అధికారిక స్పందన రాకపోయినా, ఈ ఘటన ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో