Loading...
Kumkum Mohod: రికర్వ్ ఆర్చరీలో చరిత్ర సృష్టించిన కుంకుమ్ మహోద్‌.. భారత్‌కు స్వర్ణం!
రికర్వ్ ఆర్చరీలో చరిత్ర సృష్టించిన కుంకుమ్ మహోద్‌.. భారత్‌కు స్వర్ణం!

Kumkum Mohod: రికర్వ్ ఆర్చరీలో చరిత్ర సృష్టించిన కుంకుమ్ మహోద్‌.. భారత్‌కు స్వర్ణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2026
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీ క్రీడాకారులు వరుసగా బంగారు పతకాలతో సత్తా చాటుతున్నారు. 14వ రోజు భారత్‌కు పసిడితో శుభారంభం అందించిన కుంకుమ్ మహోద్ (Kumkum Mohod).. రికర్వ్ ఆర్చరీలో చరిత్ర సృష్టించారు. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఓయెజిన్‌ను ఓడించి అగ్రస్థానంలో నిలిచారు. తద్వారా ఆసియా క్రీడల సింగిల్స్‌లో రికర్వ్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా కుంకుమ్ మహోద్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతకుముందు శుక్రవారం భారత మహిళల రికర్వ్ జట్టు కూడా అపూర్వ విజయాన్ని నమోదు చేసింది. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది.

వివరాలు

మొత్తం రెండు స్వర్ణాలు, ఒక  రజతం

అంకిత భకత్, కీర్తి శర్మ, కుంకుమ్ మహోద్‌లతో కూడిన భారత జట్టు మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌ దక్షిణ కొరియా త్రయంపై విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

మరోవైపు మిక్స్‌డ్ రికర్వ్ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, కుంకుమ్ మహోద్ జోడీ కూడా పతకం సాధించింది.

అయితే ఫైనల్లో చైనా జోడీ చేతిలో ఓటమిపాలై బంగారు పతకాన్ని త్రుటిలో చేజార్చుకుంది. దీంతో రజత పతకంతో సరిపెట్టుకుంది.

తాజా వ్యక్తిగత స్వర్ణంతో ఈ ఆసియా క్రీడల్లో కుంకుమ్ మహోద్ ఖాతాలో మొత్తం రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం చేరాయి.

ఆర్చరీలో వరుస విజయాలతో ఆమె ఈ క్రీడల్లో భారత్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు.

ADVERTISEMENT