Vaibhav Sooryavanshi: వైభవ్ వికెట్‌పై అతిగా సంబరాలు.. ఢిల్లీ బౌలర్‌పై విమర్శల వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. కేవలం 4 పరుగులకే పేసర్ జేమీసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. అయితే, వైభవ్ ఔట్ అయిన తర్వాత ఢిల్లీ బౌలర్ అతిగా సంబరాలు చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. జేమీసన్ ప్రవర్తనపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
జేమీసన్ అధిక ఉత్సాహం..
శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఓటమి పాలైంది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌లో జేమీసన్ వేసిన ఐదో బంతికి వైభవ్ (4) బౌల్డ్ అయ్యాడు. ఇప్పటికే తొలి ఓవర్‌లో యశస్వీ వికెట్ కోల్పోయిన రాజస్థాన్‌కు ఇది మరో దెబ్బగా మారింది. ఈ సందర్భంలో వైభవ్ ఔట్ అయిన వెంటనే జేమీసన్ అధిక ఉత్సాహంతో స్పందించాడు. వైభవ్ వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
𝙏𝙝𝙚 𝙍𝙤𝙖𝙧 𝙊𝙛 𝘼 𝙏𝙞𝙜𝙚𝙧 🔥🐅pic.twitter.com/eRjKOlhzFR
— Delhi Capitals (@DelhiCapitals) May 1, 2026