
German Open 2023లో నిరాశ పరిచిన లక్ష్యసేన్
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నో అంచనాలతో జర్మన్ ఓపెన్ వరల్డ్ టూరు సూపర్-300 బ్యాడ్మింటన్ బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్యసేన నిరాశ పరిచాడు.
బుధవారం ముల్‌హీమ్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పోపోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించి చెత్త రికార్డును మూటకట్టుకున్నారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) 21-19, 21-16తో ఆరో సీడ్ లక్ష్య సేన్‌ను బోల్తా కొట్టించి, రెండో రౌండ్‌కి అర్హత సాధించాడు.
లక్ష్యసేన్
మిథున్ మంజునాథ్ ఓటమి
పొపోవ్‌పై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్.. ప్రస్తుతం రెండోసారి పోపోవ్‌పై చేతిలో ఓడిపోయాడు
మిథున్ మంజునాథ్ పోరాడినా పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన నాలుగో సీడ్ లోహ్ కీన్ యూ చేతిలో 8-21 21-19 11-21 తేడాతో ఓడిపోయాడు.
మహిళల సింగిల్స్‌లో మాళవికా బన్సోద్ 13-21 14-21తో చైనాకు చెందిన ఐదో సీడ్, ప్రపంచ ఆరో ర్యాంకర్ వాంగ్ జి యి చేతిలో ఓడిపోగా, తస్నిమ్ మీర్ థాయ్‌లాండ్‌కు చెందిన ఎనిమిదో సీడ్ పోర్న్‌పావీ చొచువాంగ్ చేతిలో 8-21 10-21 తేడాతో ఓటమి పాలైంది.