Page Loader
లెజండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నూమూత
లెజెండరీ ప్లేయర్ పీలే

లెజండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నూమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2022
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. బ్రెజిల్కు మూడుసార్లు కప్పు అందించిన పీలే(82) కన్నుమూశారు. పీలే చాలా సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పీలే మరణాన్ని అతని కుమార్తె కెల్లీ నాసిమెంటో ఇన్ స్టాగ్రామ్‌లో వెల్లడించారు. 1958, 1962, 1970లో బ్రెజిల్‌కు ప్రపంచ కప్పును అందించారు. పీలే 1363 మ్యాచ్ లు 1281 గోల్స్ చేసి రికార్డు బద్దలు కొట్టారు. మొదటి ఫుట్ బాల్ సూపర్ స్టార్ పీలేకు పేరొచ్చింది. సెప్టెంబరు 2021 నుంచి అతని కణితిని తొలగించే శస్త్రచికిత్స చేశారు. తర్వాత పీలే పెద్దప్రేగు క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నాడు. గత నెల నుంచి పలు ఆరోగ్య సమస్యలతో వివిధ ఆస్పత్రిలో చికిత్సను తీసుకున్నారు. పీలే రెండు దశాబ్దాలు తన క్రీడల ద్వారా అభిమానులను అలరించాడు.

ఫుట్ బాల్ ప్లేయర్ పీలే

బ్రెజిల్ తరుపున 91 మ్యాచ్‌లో 77 గోల్స్

పీలే 1958 ప్రపంచకప్ ఫైనల్‌లో 17 ఏళ్ల యువకుడిగా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తరువాత 1970లో బ్రెజిల్ జట్టుకు నాయకత్వం వహించారు. అప్పట్లో అతని సహచరులుగా నిల్టన్ శాంటోస్, దీదీ, గారించా, జైర్జిన్హో ఉన్నారు. వారంతా ఆ సమయంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఉన్నారు. పీలే తన కెరీర్‌లో ఎక్కువ భాగం జాతీయ లీగ్‌లో కాకుండా రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో గడిపాడు. బ్రెజిల్ తరుఫున 91 మ్యాచ్ లో 77 గోల్స్ చేశాడు. ప్రస్తుతం ఆ రికార్డును ఇటీవల ప్రపంచ కప్ సందర్భంగా నెయ్మార్ సమం చేశారు. పీలే మృతి క్రీడా ప్రపంచానికి తీవ్ర విషాదమని ఆయన అభిమానులు విచార వ్యక్తం చేస్తున్నారు.