
Sunny Thomas: లెజెండరీ షూటింగ్ కోచ్ సన్నీ థామస్ ఇకలేరు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత షూటింగ్ కోచ్, మాజీ జాతీయ చాంపియన్ సన్నీ థామస్ (83) కన్నుమూశారు.
ఆయన కేరళ రాష్ట్రం కొట్టాయంలోని ఉజావూర్ ఇంట్లో తీవ్ర స్ట్రోక్ కారణంగా ప్రాణాలు విడిచారు.
బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం ఆయనకు స్ట్రోక్ వచ్చినట్లు తెలిసింది. ఈ సమయంలో ఆయన భార్య జోసమ్మ అక్కడే ఉన్నారు. తండ్రి సన్నీ థామస్ గుండెపోటుతో మరణించినట్లు ఆయన కొడుకు మనోజ్ సన్నీ తెలిపారు.
సన్నీ థామస్ 1941 సెప్టెంబర్ 26న కొట్టాయం జిల్లాలోని తిడనాడ్‌లో జన్మించారు.
రైఫిల్ షూటింగ్‌లో జాతీయ చాంపియన్‌గా పేరు పొందిన సన్నీ, ఇంగ్లీష్ బోధనలో కూడా శిక్షణ ఇచ్చారు. 1993 నుండి 2012 వరకు భారత షూటింగ్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.
Details
అనేకమంది యువ షూటర్స్ ని పరిచయం చేసిన సన్నీ థామస్
ఆయన శిక్షణలో భారతీయ షూటింగ్ జట్టు ఒలింపిక్స్, ప్రపంచ, ఆసియా, కామన్‌వెల్త్ గేమ్స్‌లో అనేక పతకాలు గెలిచింది.
మొత్తం 108 బంగారు, 74 సిల్వర్, 53 కాంస్య పతకాలు సాధించింది. ఆయన రైఫిల్ 3 పొజిషన్ ఓపెన్ సైట్ ఈవెంట్‌లో నేషనల్ చాంపియన్‌గా నిలిచారు.
కొట్టాయం రైఫిల్ క్లబ్‌లోనే ఆయన షూటింగ్‌కు మొదలు పెట్టారు. సన్నీ థామస్ కోచ్‌గా ఉన్నపుడు, అనేక మంది యువ షూటర్స్‌ని పరిచయం చేశారు.
2004 ఏథేన్స్ ఒలింపిక్స్‌లో మేజర్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ (సిల్వర్), 2008లో అభినవ్ బింద్రా (గోల్డ్), 2021 లండన్ ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్ (సిల్వర్), గగన్ నారంగ్ (బ్రాంజ్)లు పతకాలు సాధించారు.