క్లబ్ గోల్స్‌తో రికార్డు సృష్టించిన లెవాండోస్కీ
యూరోపియన్ క్లబ్ ఫుట్‌బాల్‌లో రాబర్ట్ లెవాండోస్కీ అరుదైన రికార్డును సృష్టించాడు. 2022-23లో UEFA యూరోపా లీగ్ ప్లేఆఫ్ 2వ-లెగ్ టైలో మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తరపున 25వ గోల్ చేసి రికార్డుకెక్కాడు. లెవాండోస్కీ 19 లా లిగా మ్యాచ్‌ల్లో 15 గోల్స్ చేశాడు. అదే విధంగా ఐదు అసిస్ట్‌లతో సత్తా చాటాడు. ఛాంపియన్స్ లీగ్‌లో అంతకుముందు ఐదు గోల్స్‌ను చేసిన విషయం తెలిసిందే. లెవాండోస్కీ స్పానిష్ సూపర్ కప్, కోపా డెల్ రేలో వరుసగా రెండు గోల్స్ చేశాడు.
లెవాండోస్కీ సాధించిన రికార్డులివే
లెవాండోస్కీ 2011-12లో బోరుస్సియా డార్ట్‌మండ్ కోసం మొదటి గోల్ ను చేశాడు. ఈ పోటీల్లో మొత్తం 30 గోల్స్ చేసి అరుదైన ఫీట్‌ను సాధించారు. 2012-13లో 36, 2013-14లో 28 గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. డార్ట్‌మండ్ తరఫున లెవాండోస్కీ 187 గేమ్‌లలో 103 గోల్స్ సాధించాడు. మాంచెస్టర్ యునైటెడ్ వారి UEL ప్లేఆఫ్ టై (2వ లెగ్)లో బార్సిలోనాపై 2-1తో విజయం సాధించింది. మొదటి లెగ్‌లో 2-2తో డ్రా అయిన తర్వాత, బ్రూనో ఫెర్నాండెజ్ ఫౌల్ చేయడంతో రాబర్ట్ లెవాండోస్కీ పెనాల్టీ గోల్ చేయడంతో బార్సిలోనా 1-0 ఆధిక్యంలో నిలిచింది.