Page Loader
ఇంటర్ మియామి క్లబ్‌లో లియోనెల్ మెస్సీ
ఇంటర్ మియామితో చేతులు కలిపిన మెస్సీ

ఇంటర్ మియామి క్లబ్‌లో లియోనెల్ మెస్సీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2023
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఈ మధ్యనే పీఎస్‌జీ క్లబ్ ను వీడిన సంగతి తెలిసిందే. దాంతో అతను వచ్చే సీజన్లో ఏ క్లబ్ తో ఒప్పందం చేసుకుంటాడనే చర్చలు ఊపందుకున్నాయి. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్ క్లబ్ మెస్సీని సంప్రదించిందని, అతను తిరిగి బార్సిలోనాకు ఆడతాడనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా అమెరికాకు చెందిన ఇంటర్ మియామి క్లబ్ లో చేరినట్లు మెస్సీ ప్రకటించాడు. ఈ క్లబ్ కు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు డేవిడ్ బెక్ హమ్ యాజమానిగా ఉన్నాడు. దీంతో కాంట్రాక్టు విలువ కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా అడిడాస్, యాపిల్ వంటి కంపెనీలతో మెస్సీకి ఒప్పందం కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Details

లియోనెల్ మెస్సీ సాధించిన రికార్డులివే

మెస్సీ బార్సిలోనా తరపున 778 మ్యాచ్‌లు ఆడాడు, రికార్డు స్థాయిలో 672 గోల్స్ చేశాడు. బార్సిలోనా తరఫున మెస్సీ 269 అసిస్ట్‌లు సాధించాడు. మెస్సీ బార్సిలోనా తరపున 520 లా లిగ్ గేమ్‌లలో 474 గోల్స్ చేసి రికార్డు సృష్టించాడు. PSG తరుపున 32 గోల్స్, 34 అసిస్ట్‌లను అందించాడు. మొత్తంమీద మెస్సీ యూరోపియన్ క్లబ్ కెరీర్‌లో 704 గోల్స్ చేసి, 303 అసిస్ట్‌లను సంపాదించాడు. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న మెస్సీ గతేడాది ఖ‌త‌ర్‌లో అర్జెంటీనాకు ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ కు అందించిన విషయం తెలిసిందే.మెస్సీకి మియామిలో సొంతిల్లు ఉంది.