Page Loader
అలా ప్రవర్తించడం నాకే నచ్చలేదు :  మెస్సీ
తన చర్యలతో అశ్చర్యపరిచిన మెస్సీ

అలా ప్రవర్తించడం నాకే నచ్చలేదు : మెస్సీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2023
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన కెరీర్ లో లోటుగా ఉన్న ఫిఫా వరల్డ్ కప్ ను గతేడాది అందుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ ను అందుకోవడంలో నాలుగుసార్లు విఫలమైన మెస్సీ ఐదో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. జట్టును అంతా తానై నడిపించి, ఫైనల్లో ఫ్రాన్స్ పై షూటౌట్ ద్వారా విజేతగా నిలిపాడు. టోర్నిలో ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును కైవసం చేసుకున్నాడు. డిసెంబర్ 9న క్వార్టర్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్ మేనేజర్ లూయిస్ వాన్ గాల్‌తో, వరల్డ్ కప్ ఛాంపియన్ లియోనెల్ మెస్సీ అసభ్యంగా ప్రవర్తించడం సంచలనం రేపింది. దీనిపై అప్పుడే స్పందించిన మెస్సీ.. గేమ్‌లో భాగంగా తాను కంట్రోల్ తప్పానని, ఆ సమయంలో అలా ప్రవర్తించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

మెస్సీ

టెన్షన్‌లో సహనం కోల్పోయా : మెస్సీ

మెస్సీ తన రెండు చేతులను చెవుల మధ్య పెట్టి కోపంగా చూస్తూ ఫోజివ్వడం సంచలనం కలిగించింది. తన నుంచి ఇలాంటి ఎక్స్ ప్రెషన్ వస్తుందని మెస్సీ అభిమానులు అస్సలు ఊహించలేదు. దీంతో కొంతమంది మెస్సీని తప్పుబట్టారు. తాజాగా మరోసారి దానిపై మెస్సీ మాట్లాడారు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో అలా ప్రవర్తించడం తప్పేనని, తాను చేసింది తనకు నచ్చలేదని, అందుకే ఆ రోజు దాని గురించి వివరణ ఇచ్చానని చెప్పారు. టెన్షన్ లో ఉన్నప్పుడు ఓ సారి సహనాన్ని కోల్పోతామని, తనకు కూడా ఆ రోజు అలానే జరిగిందని మెస్సీ వివరణ ఇచ్చారు.