LOADING...
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో సిక్సర్ల సునామీ… టాప్ హిట్టర్లు ఎవరో తెలుసా?
టీ20 వరల్డ్ కప్‌లో సిక్సర్ల సునామీ… టాప్ హిట్టర్లు ఎవరో తెలుసా?

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో సిక్సర్ల సునామీ… టాప్ హిట్టర్లు ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2026
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 క్రికెట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సిక్సర్ల వర్షమే. మైదానంలో బ్యాటర్లు బంతిని గాల్లోకి ఎగరేసి నేరుగా స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే ప్రేక్షకులకు వచ్చే ఉత్సాహం వేరే లెవల్. ముఖ్యంగా ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో ప్రపంచ స్థాయి బ్యాటర్లు తమ పవర్ హిట్టింగ్‌తో రికార్డులను బద్దలు కొట్టారు. సిక్సర్ల పరంగా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ నుంచి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ వరకు టాప్-5లో నిలిచిన హిట్టింగ్ వీరులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

క్రిస్ గేల్ :

వెస్టిండీస్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచారు. 2007 నుంచి 2021 వరకు ఆయన పాల్గొన్న 33 మ్యాచ్‌ల్లో ఏకంగా 63 సిక్సర్లు కొట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. గేల్ క్రీజులోకి వచ్చాడంటే చాలు, బంతి బౌండరీ దాటడం ఖాయమన్న భయం బౌలర్లలో కనిపించేది. ఆయన పవర్ హిట్టింగ్ టీ20 క్రికెట్‌కు కొత్త నిర్వచనమే ఇచ్చింది.

వివరాలు 

రోహిత్ శర్మ: 

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. హిట్‌మ్యాన్‌గా పేరొందిన రోహిత్ 2007 నుంచి 2024 వరకు ఆడిన 47 మ్యాచ్‌ల్లో 50 సిక్సర్లు బాదారు. సహజమైన టైమింగ్, క్లాస్‌తో ఆయన కొట్టే సిక్సర్లు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటాయి. 1200కు పైగా పరుగులు సాధించి, భారత్ వరల్డ్ కప్ విజయాల్లో రోహిత్ కీలక పాత్ర పోషించారు. జోస్ బట్లర్ : ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన వినూత్న షాట్లతో టీ20 వరల్డ్ కప్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 35 మ్యాచ్‌ల్లో 43 సిక్సర్లు కొట్టి మూడో స్థానంలో నిలిచారు. మైదానం నలుమూలలా షాట్లు ఆడగల నైపుణ్యం బట్లర్‌ను అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా మార్చింది.

Advertisement

వివరాలు 

డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. 41 మ్యాచ్‌ల్లో ఆయన 40 సిక్సర్లు బాదారు. భారీ షాట్లకు కేవలం బలం మాత్రమే కాదు, సరైన టైమింగ్ ఎంత ముఖ్యమో వార్నర్ తన ఆటతో నిరూపించారు. ఆస్ట్రేలియాకు టీ20 వరల్డ్ కప్ అందించడంలో ఆయన సిక్సర్లు కీలకంగా నిలిచాయి. సాధారణంగా క్లాసిక్ షాట్లు, సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించే విరాట్ కోహ్లీ అవసరమైన వేళ సిక్సర్లతో దుమ్మురేపడంలోనూ ముందుంటారు. 35 మ్యాచ్‌ల్లో 35 సిక్సర్లు బాది టాప్-5లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఒత్తిడి సమయంలో కోహ్లీ కొట్టే సిక్సర్లు టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించాయి.

Advertisement