LOADING...
IND w Vs AUS w: ఆసీస్‌పై చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచ రికార్డులు ఇవే..  
ఆసీస్‌పై చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచ రికార్డులు ఇవే..

IND w Vs AUS w: ఆసీస్‌పై చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచ రికార్డులు ఇవే..  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత విజయాన్ని భారత్‌ సొంతం చేసుకుంది. నాకౌట్‌ దశలో ఆస్ట్రేలియాపై గెలవడం అంటే దాదాపు ప్రపంచ కప్‌ను అందుకున్నట్లే చెప్పాలి. అంతేకాదు,339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం సాధారణ విషయం కాదు. మహిళల వన్డే ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను (IND W vs AUS W) ఓడించిన టీమ్‌ఇండియా ఫైనల్‌ బరిలోకి దూసుకెళ్లింది. దివారం దక్షిణాఫ్రికాతో టైటిల్‌ కోసం టీమ్‌ఇండియా తలపడనుంది.ఈ విజయంతో భారత్‌ తన ఖాతాలో పలు ప్రపంచ రికార్డులను నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియా ఓటమిపాలైనా, ఆ జట్టు బ్యాటర్‌ ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ సెంచరీతో ఒక ప్రత్యేక రికార్డును సృష్టించింది. ఇప్పుడు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఈ సెమీఫైనల్‌లో నమోదైన ప్రధాన ఘనతలను ఒకసారి చూద్దాం.

వివరాలు 

పురుషుల, మహిళల క్రికెట్‌ రెండింటిలో ఎక్కువ పరుగుల లక్ష్యం 

మహిళల వన్డే ప్రపంచ కప్‌ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు నమోదైన ఘనత ఇదే. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు కలిపి మొత్తం 14 సిక్స్‌లు బాదాయి. భారత్‌ 5, ఆస్ట్రేలియా 9. వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ దశలో 300 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన తొలి సందర్భం ఇదే. ఇది పురుషుల, మహిళల క్రికెట్‌ రెండింటికీ వర్తిస్తుంది. మహిళల వన్డే చరిత్రలో 339 పరుగుల అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా భారత్‌ కొత్త రికార్డు నెలకొల్పింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాదే.. అది కూడా భారత్‌పై, ఈ వరల్డ్‌ కప్‌ లీగ్‌ దశలో 331 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.

వివరాలు 

సెమీఫైనల్‌లో మొత్తం 679 పరుగులు

భారత్‌, ఆస్ట్రేలియా జట్లు కలిపి ఈ సెమీఫైనల్‌లో మొత్తం 679 పరుగులు సాధించాయి. వన్డే ప్రపంచ కప్‌ చరిత్రలో అత్యధిక రన్స్‌ నమోదైన మ్యాచ్‌ ఇదే. ఇంతకు ముందు 2017లో ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 678 పరుగులు వచ్చాయి. ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ ఈ మ్యాచ్‌లో శతకం సాధించి, వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్సు (22 ) బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.