Page Loader
ప్రీమియర్ లీగ్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసిన లివర్‌పూల్
2-0తో ఎవర్టన్‌ను లివర్‌పూల్ ఓడించింది

ప్రీమియర్ లీగ్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసిన లివర్‌పూల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2023
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రీమియర్ లీగ్ 2022-23లో లివర్‌పూల్ మొదటిసారిగా విజయాన్ని నమోదు చేసింది. 2-0తో ఎవర్టన్‌ను ఓడించి లివర్ పూల్ సత్తా చాటింది. మొహమ్మద్ సలా, కోడి గక్పో గోల్స్ చేసి లివర్ పూల్‌కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ముఖ్యంగా 2023లో లివర్‌పూల్‌కు ఇది తొలి విజయం కావడం విశేషం. గత సీజన్ ప్రారంభం నుండి, ఎవర్టన్ ఎక్కువ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను ఓడిపోవడం గమనార్హం. జనవరి 2011లో రౌల్ మీరెల్స్ తర్వాత మెర్సీసైడ్ డెర్బీలో తన మొదటి ప్రీమియర్ లీగ్ గోల్ చేసిన మొదటి లివర్‌పూల్ ఆటగాడిగా గాక్పో నిలిచాడు. గాక్పో ప్రస్తుతం 2022-23 సీజన్‌లో క్లబ్, దేశం తరుపున 19 గోల్స్ చేసి, 18 అసిస్ట్‌లను పొందాడు.

లివర్‌పూల్

తొమ్మిదో స్థానంలో లివర్‌పూల్

21 ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల్లో సలా ఎనిమిది గోల్స్‌తో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఓకే స్టేడియంలో 100 ప్రీమియర్ లీగ్స్ గోల్స్ లో పాల్గొన్న 13వ ఆటగాడిగా సలా నిలిచాడు. 104 మ్యాచ్‌ల్లో 71 గోల్స్ చేసి, 29 అసిస్ట్‌లను పొందాడు. జుర్గెన్ క్లోప్ అన్ని పోటీలలో లివర్‌పూల్ మేనేజర్‌గా తన 250వ విజయాన్ని నమోదు చేశాడు. ఇప్పటివరకూ లివర్ పూల్‌ తరుపున 414 మ్యాచ్‌లకు జుర్గెన్ క్లోప్ మేనేజర్‌గా కొనసాగాడు. (బాబ్ పైస్లీ 448, బిల్ షాంక్లీ 472, టామ్ వాట్సన్ 539) అతని కంటే ముందు ఉన్నాడు. 32 పాయింట్లతో, లివర్‌పూల్ ప్రీమియర్ లీగ్ స్టాండింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది.