Page Loader
లివింగ్ స్టోన్ పోరాడినా పంజాబ్‌కు తప్పని ఓటమి; ఢిల్లీ క్యాపిటల్స్ విజయం 
లివింగ్ స్టోన్ పోరాడినా పంజాబ్‌కు తప్పని ఓటమి; ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

లివింగ్ స్టోన్ పోరాడినా పంజాబ్‌కు తప్పని ఓటమి; ఢిల్లీ క్యాపిటల్స్ విజయం 

వ్రాసిన వారు Stalin
May 17, 2023
11:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో భాగంగా బుధవారం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) 15పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ 94(5ఫోర్లు, 9సిక్స్‌లు) పరుగులతో మెరుపులు మెరిపించినా పీబీకేఎస్‌కు ఓటమి తప్పలేదు. నిర్ణీత 20ఓవర్ల నష్టానికి పంజాబ్ 8వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసిన 15రన్స్ తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. దిల్లీని బ్యాంటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో మొదటి సారి బ్యాటింగ్ చేసిన దిల్లీ 213 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో పంజాబ్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్ ఓటమితో ప్లే-ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్‌ పూర్తిగా తొలగిపోయినట్లు అయ్యింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

15రన్స్ తేడాతో డీసీ విజయం