
Womens T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో నిర్వహించనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది.
తాజా షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ 2026 జూన్ 12న ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ జూలై 5న లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఫైనల్‌తో ముగియనుంది.
మొత్తం 24 రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో 33 మ్యాచ్‌లు ఆడతారు. 12 జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి.
ఈ పోటీలు ఇంగ్లాండ్‌లోని అనేక ప్రఖ్యాత మైదానాల్లో నిర్వహించనున్నారు.
ముఖ్యంగా లండన్‌లోని లార్డ్స్, ది ఓవల్, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, లీడ్స్‌లోని హెడింగ్లీ, బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్, బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదికలుగా నిలవనున్నాయి.
వివరాలు
ఇప్పటికే అర్హత సాధించిన జట్లు:
ఇందులో ఒక ముఖ్యమైన విషయమేంటంటే, లార్డ్స్ మైదానం మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ టోర్నమెంట్‌కు ఇప్పటివరకు భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తమ ప్రాతినిధ్యం నిర్ధారించుకున్నాయి. మిగిలిన నాలుగు జట్లను క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఎంపిక చేయనున్నారు.
వివరాలు
టోర్నమెంట్ ఫార్మాట్
మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి.
లీగ్ దశ అనంతరం నాకౌట్ దశ జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఈ టోర్నీకి డిఫెండింగ్ ఛాంపియన్‌గా న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది.
ఇక భారత మహిళల జట్టు ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌ను గెలవలేకపోయింది.
ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జైషా మాట్లాడుతూ, "2026 మహిళల టీ20 ప్రపంచకప్ దిశగా మేము ముందుకు సాగుతున్నాం. ఈ టోర్నీకి వేదికల ఎంపిక చాలా ముఖ్యమైన దశ. ఇది ప్రపంచ స్థాయి మహిళా క్రికెటర్లను ఒకే వేదికపై చూపించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇది క్రీడాస్ఫూర్తి మరియు నైపుణ్యానికి వేదిక అవుతుంది." అని అన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐసీసీ చేసిన ట్వీట్
📍 7 venues. One unmissable tournament 🏆
— ICC (@ICC) May 1, 2025
The ICC Women’s T20 World Cup 2026 will grace some of England’s most iconic grounds 🤩
✍️: https://t.co/BqtN44SMEX pic.twitter.com/UmkuBU4HL3