
Los Angeles Olympics 2028: లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028.. క్రికెట్ టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు 128 సంవత్సరాల విరామం తర్వాత క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్‌లోకి ప్రవేశించనుంది. 'లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028' నిర్వాహకులు విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం టీ20 ఫార్మాట్‌లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ జూలై 12, 2028న ప్రారంభం కానుంది. 1900 తర్వాత మళ్లీ క్రికెట్‌కు ఒలింపిక్ వేదిక క్రికెట్ చివరిసారి 1900లో ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించింది. అప్పట్లో కేవలం గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పాల్గొన్నాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు క్రికెట్ ఒలింపిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు లాస్ ఏంజెలెస్ వేదికగా మరోసారి ఈ గేమ్‌కు అవకాశం లభించడంతో క్రికెట్ ప్రేమికులందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది.
Details
పురుషులు, మహిళలకు వేరే విభాగాల్లో మ్యాచ్‌లు
ఈ సారి పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఆరు జట్లు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నాయి. అన్ని మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో జరుగుతాయి. షెడ్యూల్ వివరాలు ఇలా.. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు రెండు విడతలుగా మొదటి విడత: జూలై 12 నుంచి18 రెండవ విడత: జూలై 22 నుంచి28 సెమీఫైనల్, మెడల్ మ్యాచ్‌లు పురుషుల సెమీఫైనల్, మెడల్ మ్యాచ్‌లు:జూలై 19 మహిళల సెమీఫైనల్, మెడల్ మ్యాచ్‌లు: జూలై 29 ప్రతిరోజూ డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఒక్కో జట్టుకు 15 మంది సభ్యులకు అవకాశం ఉంటుంది. మొత్తం 180 అథ్లెట్ కోటాలు కేటాయించనున్నారు. లాస్ ఏంజెలెస్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోమోనా ఫెయిర్‌ప్లెక్స్ స్టేడియంలో జరగనున్నాయి.