Page Loader
యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ ఓటమి
యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ ఓటమి

యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ ఓటమి

వ్రాసిన వారు Stalin
Jul 16, 2023
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ షట్లర్ లక్ష్య‌సేన్ శనివారం జరిగిన యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో ఓడిపోయాడు. దీంతో అతను టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. సెమీ ఫైనల్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ లీ షిఫెంగ్‌తో హోరాహోరీగా జరిగిన పోరు లక్ష్య సేన్ 17-21, 24-22, 17-21 తేడాతో ఓడిపోయాడు. లక్ష్య సేన్‌కు మొదటి రౌండ్‌లో మంచి ఆరంభం దక్కలేదు. అది అతని ఆట మొత్తంపై ప్రభావం చూపింది. మొదటి గేమ్‌ను కేవలం నాలుగు పాయింట్ల తేడాతో కోల్పోయాడు. ఆ తర్వాత రెండో గేమ్‌లో సేన్ తిరిగి పంజుకున్నాడు. కానీ మూడో గేమ్ లో షిఫెంగ్‌ రెచ్చిపోడవంతో సేన్ ఓటమి ఖరారు అయ్యింది. జూలై 11న ప్రారంభమైన యూఎస్ ఓపెన్ ఆదివారంతో ముగియనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లక్ష్యసేన్ ఓటమిపై బీఏఐ ట్వీట్