
PV Sindhu: 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్'.. తన ప్రేమ కథను పంచుకున్న పీవీ సింధు
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.
పివి.సింధు తన మిత్రుడు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది.
ఈ వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సు వద్ద అత్యంత వైభవంగా, కుటుంబసభ్యుల, సన్నిహితుల మధ్య జరగింది.
తన పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ సింధు 'హృదయం' ఎమోజీతో అభిమానులను అలరించింది.
తాజాగా వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు తన ప్రేమ కథ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
'సాయి ఎస్ఐ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ, 2022 అక్టోబరులో ఓ విమాన ప్రయాణంతోనే మా ప్రేమ కథ మొదలైందన్నారు.
Details
ఆ రోజే ప్రేమ మొదలైంది
ఆ జర్నీ తమకు ప్రత్యేకంగా దగ్గరయ్యే అవకాశాన్ని కల్పించిందన్నారు.
ఆ క్షణం 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అనిపించిందని, ఆ రోజే మా ప్రేమ ప్రయాణం ఆరంభమైందని సింధు తెలిపింది.
అదే సమయంలో, తన నిశ్చితార్థం గురించి మాట్లాడిన సింధు, తమ ఎంగేజ్‌మెంట్ చాలా తక్కువమంది సమక్షంలో జరిగిందన్నారు.
తమ జీవితంలోని ఆ ముఖ్య ఘట్టాన్ని మనసుకు బాగా దగ్గరగా ఉన్నవారితో సెలబ్రేట్ చేసుకోవాలని తాము అనుకున్నామని, అది మా జీవితంలో అత్యంత భావోద్వేగభరితమైన క్షణమన్నారు.