LOADING...
LSG: లక్నో ఓటమిపై మైదానంలోనే గోయెంకా ఆగ్రహం.. పంత్‌తో వాగ్వాదం వీడియో వైరల్
లక్నో ఓటమిపై మైదానంలోనే గోయెంకా ఆగ్రహం.. పంత్‌తో వాగ్వాదం వీడియో వైరల్

LSG: లక్నో ఓటమిపై మైదానంలోనే గోయెంకా ఆగ్రహం.. పంత్‌తో వాగ్వాదం వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోరంగా ఓడిపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. 6 వికెట్ల తేడాతో పరాజయం పొందిన తర్వాత, జట్టు యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోనే కెప్టెన్ రిషభ్ పంత్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌తో తీవ్రంగా చర్చిస్తున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గోయెంకా ప్రవర్తనపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన కొత్తది కాదు. 2024 ఐపీఎల్ సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి అనంతరం అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో గోయెంకా బహిరంగంగా అసహనం వ్యక్తం చేసిన విషయం నెటిజన్లు మరోసారి గుర్తుచేస్తున్నారు. అదే తరహాలో మైదానంలోనే స్పందించడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది.

వివరాలు 

ఓటమిపై రిషబ్ పంత్

మ్యాచ్ విషయానికి వస్తే,ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 141పరుగులకే ఆలౌట్ అయి నిరాశపరిచింది. తక్కువ స్కోరుతో ఢిల్లీకి సులభ లక్ష్యం ఇచ్చిన లక్నో బౌలర్లు మొదట్లో కొంత ఒత్తిడి తీసుకువచ్చినా, అది ఎక్కువ సేపు నిలబడలేదు. సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ సమర్థవంతంగా బ్యాటింగ్ చేసి,ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టుకు సులభ విజయం అందించారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రిషబ్ పంత్ ఓటమిపై స్పందిస్తూ,బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశాడు. కొత్త బంతితో పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ,భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలమయ్యామని అంగీకరించాడు. తక్కువ స్కోరు చేసినప్పుడు బౌలర్లపై ఒత్తిడి పెరగడం సహజమని పేర్కొన్నాడు. పవర్‌ప్లేలో మరికొన్ని వికెట్లు తీసి ఉంటే మ్యాచ్ ఫలితం మారిపోయేదేమోనని అభిప్రాయపడ్డాడు.

వివరాలు 

ఢిల్లీ బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించి..

అలాంటి పరిస్థితుల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, బ్యాటర్లతో బౌలింగ్ చేయించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాడు. లక్నో బౌలర్లు ప్రారంభంలో ఢిల్లీని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి పతుమ్ నిస్సంకను అవుట్ చేయడంతో పాటు అక్షర్ పటేల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినప్పటికీ, లక్ష్యం చిన్నదిగా ఉండటంతో ఢిల్లీ బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన వికెట్ గురించి ప్రశ్నించగా, పంత్ ఆసక్తికరంగా స్పందించాడు. కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవని, వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల వెనుకబడిపోతామని చెప్పాడు. ఆ సంఘటనను పట్టించుకోకుండా ముందుకు సాగడమే మంచిదని అభిప్రాయపడ్డాడు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే.. 

Advertisement