LSG vs PBKS: దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్.. లక్నోపై పంజాబ్ విక్టరీ
ఈ వార్తాకథనం ఏంటి
లక్నో సూపర్జెయింట్స్‌తో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో విజయం అందుకుంది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ జట్టు కేవలం 18 ఓవర్లలోనే ఛేదించి సత్తా చాటింది. ఈ విజయంతో వారి ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత బలపడ్డాయి. పంజాబ్ విజయానికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రధాన కారణంగా నిలిచాడు. అతడు కేవలం 51 బంతుల్లోనే 101 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.
వివరాలు
అద్భుత ఇన్నింగ్స్..
మరోవైపు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఖాతా తెరవకుండానే అవుట్ అయినప్పటికీ, ప్రభుసిమ్రన్ సింగ్ 69 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అతడు వేగంగా పరుగులు సాధించి అయ్యార్‌కు మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో పంజాబ్ లక్ష్యాన్ని ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీసుకోగా, అర్జున్ టెండూల్కర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
వివరాలు
లక్నో బ్యాటర్ల పోరాటం..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. అతడు 44 బంతుల్లో 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు నమోదు చేశాడు. ఆయూష్ బదోని కూడా చురుకైన ఆటతో 43 పరుగులు సాధించాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అతడు ఇంగ్లిస్‌కు మంచి మద్దతుగా నిలిచాడు. ఈ ఇద్దరూ కలిసి పంజాబ్ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు.
వివరాలు
ఆకట్టుకున్న బౌలర్లు..
తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ 26 పరుగులు చేయగా, ముకుల్ ఛౌదరి కేవలం ఒక పరుగుకే పరిమితమయ్యాడు. అయితే చివర్లో అబ్దుల్ సమద్ వేగంగా ఆడి 37 పరుగులు జోడించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. దీంతో లక్నో జట్టు పోటీకి తగిన స్కోర్ నమోదు చేసింది. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, మార్కో జాన్‌సెన్ తలో రెండు వికెట్లు సాధించారు. శశాంక్ సింగ్, ఒమర్‌జై చెరో వికెట్ దక్కించుకున్నారు.