
ఢిల్లీని మట్టికరిపించిన లక్నో సూపర్ జెయింట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 16వ సీజన్ డబుల్ హెడర్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ను లక్నో చిత్తు చేసింది.
ఓపెనర్ కైలీ మేయర్స్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆ జట్టు భారీ స్కోర్‌ను అందించగా.. పేసర్ మార్క్ వుడ్ ఐదు వికెట్లతో జట్టుకు విజయాన్ని అందించారు. వార్నర్ చేసిన ఒంటరి పోరాటం వృథా అయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 193 పరుగులు చేసింది. ఓపెనర్ మేయర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతను దీపక్ హుడా(17)తో కలిసి రెండో వికెట్ కు 79 రన్స్ జోడించడం విశేషం. ఆ తర్వాత నికోలస్ పూరన్(36), బదోని(18) సిక్సర్లతో చెలరేగారు.
ఢిల్లీ
వార్నర్ పోరాటం వృథా
లక్ష్య చేధనకు బ్యాటింగ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ను లక్నో బౌలర్ మార్క్ వుడ్ హడలెత్తించాడు. అతని ధాటికి ఢిల్లీ 149 పరుగులకే పరిమితమైంది. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్ ఐదు వికెట్లు, బిష్ణోయ్, అవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.
మార్క్ వుడ్ తన తొలి ఓవర్ లోనే పృధ్వీ షా(12) ను, మిచెల్ మార్ష్(0) ను ఔట్ చేయడంలో ఢిల్లీ కష్టాల్లో పడింది. ఆ తర్వాత రిలే రస్సో, పావెల్ వెంటనే ఔట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది.
కెప్టెన్ వార్నర్ (56) ఒంటరి పోరాటం చేసినా అతడికి సహకారం అందించేవాళ్లు లేకపోవడంతో ఢిల్లీ ఓటిమి పాలైంది.