Lungi ngidi: మైదానంలో షాకింగ్ ఘటన.. తలకు గాయంతో కుప్పకూలిన ఎంగిడి.. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు లుంగీ ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ పట్టే ప్రయత్నంలో అతడు వెనక్కి పడిపోవడంతో తల నేలను బలంగా తాకింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఎంగిడిని వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అతడు స్వయంగా నడవలేని పరిస్థితి ఉండటంతో అంబులెన్స్‌ను నేరుగా మైదానంలోకి తీసుకువచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గాయం అయిన వీడియో ఇదే..
Lungi Ngidi got Injured while going for a catch
— Jeet (@JeetN25) April 25, 2026
Looks very serious 😰. Ambulance was called on ground 🚨. pic.twitter.com/GgU9g68Zsw
వివరాలు
ఏం జరిగిందంటే..?
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో అక్షర్ పటేల్ వేసిన మూడో ఓవర్‌లో మూడో బంతిని ప్రియాన్ష్ ఆర్యా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు సరిగా తగలక మిడాఫ్ వైపు గాల్లోకి ఎగిరింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న లుంగీ ఎంగిడి వెనక్కి పరుగెత్తుతూ క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి దిశను సరిగా అంచనా వేయలేక వెనక్కి పడిపోయాడు. దీంతో అతడి తల నేలను బలంగా ఢీకొట్టింది. తల నేలను తాకిన వెంటనే బంతిలా ఎగిరినట్లు కనిపించింది.
వివరాలు
మెడకు నెక్ బ్రేస్..
గాయం తీవ్రతతో ఎంగిడి కదలలేక మైదానంలోనే పడిపోయాడు. నొప్పితో విలవిలలాడుతున్న అతడిని చూసి వెంటనే ఫిజియోలు పరుగెత్తుకుంటూ వచ్చి పరీక్షించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మైదానంలోకే అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. తరలించే ముందు అతడి మెడకు నెక్ బ్రేస్ అమర్చారు. ఈ ఘటనతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఎంగిడి త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యం..
Lungi Ngidi has suffered a serious injury, and for the first time in IPL history, an ambulance has come onto the ground. This looks very serious—possibly a neck fracture, but hopefully it’s nothing that severe. 😱
— Sonu (@Cricket_live247) April 25, 2026
It is also quite shameful for the Arun Jaitley Stadium DJ to play… pic.twitter.com/CrFFc3grvB