Page Loader
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ విజేతగా మహారాష్ట్ర
విజేతగా అవతరించిన మహరాష్ట్ర

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ విజేతగా మహారాష్ట్ర

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 26, 2023
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ తొలి సీజన్లో మహరాష్ట్ర ఐరన్ మెన్ జట్టు విజేతగా అవరతరించింది. ఆదివారం జైపూర్‌లో జరిగిన ఫైనల్లో ఈగల్ ఉత్తర్ ప్రదేశ్ జట్టుపై 38-24 తేడాతో మహరాష్ట్ర ఐరన్‌మెట్ జట్టు విజయం సాధించింది. 102 గోల్స్ చేసిన గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ ఆటగాడు సుఖ్‌వీర్ సింగ్ బ్రార్ గోల్డెన్ బాల్‌ను దక్కించుకున్నాడు. అదే విధంగా లీగ్ లో అత్యధికంగా 184 గోల్స్‌ను సేవ్ చేసినందుకు తెలుగు టాలన్స్ కు చెందిన రాహుల్ టీక్ గోల్డెన్ గ్లోవ్ ను సొంతం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన బ్రార్‌కు మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్ అవార్డు లభించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఛాంపియన్ గా నిలిచిన మహారాష్ట్ర