Loading...
Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్‌లో కీలక మార్పులు.. రిజ్వాన్ సహా 13 మందికి షాక్!
పాకిస్థాన్ క్రికెట్‌లో కీలక మార్పులు.. రిజ్వాన్ సహా 13 మందికి షాక్!

Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్‌లో కీలక మార్పులు.. రిజ్వాన్ సహా 13 మందికి షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 2026-27 సీజన్‌కు సంబంధించి సీనియర్ పురుషుల జట్టు కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటించింది. ఈ కాంట్రాక్టులు 2027 జూన్ 30 వరకు అమల్లో ఉంటాయి. గతంలో అమలు చేసిన కేటగిరీ విధానాన్ని తొలగించి, ఈసారి ఫార్మాట్ ఆధారంగా కాంట్రాక్టులను కేటాయించింది. మొత్తం 38 మంది ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు కల్పించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సహా 13 మందిని తప్పించింది. ఇంగ్లండ్ సిరీస్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన విషయాలను బయటకు వెల్లడించారనే ఆరోపణలు రిజ్వాన్‌పై వచ్చాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈసారి ఏ ఒక్క ఆటగాడికీ మూడు ఫార్మాట్లలో కాంట్రాక్టు లభించలేదు.

వివరాలు

రిజ్వాన్‌తో పాటు పలువురు కీలక ఆటగాళ్లు అవుట్

రిజ్వాన్‌తో పాటు గతంలో బి కేటగిరీలో ఉన్న సైమ్ అయూబ్, హసన్ అలీ కూడా కొత్త జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు.

మాజీ కెప్టెన్ షాన్ మసూద్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, నోమన్ అలీ, హుస్సేన్ తలత్, ఖుర్రమ్ షెహజాద్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్‌లు కూడా కాంట్రాక్టులు కోల్పోయారు.

మరోవైపు బాబర్ ఆజమ్, సల్మాన్ అలీ ఆఘాలకు టెస్టు, వన్డే కాంట్రాక్టులు లభించాయి. ఇటీవల టెస్టు కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టిన బాబర్ నేతృత్వంలో పాకిస్థాన్ జట్టు రెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది.

టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సల్మాన్ అలీ ఆఘాకు మాత్రం ఈసారి టీ20 కాంట్రాక్టు దక్కలేదు.

వివరాలు

ఫార్మాట్ల వారీగా కాంట్రాక్టులు

టెస్టు ఫార్మాట్‌లో అజాన్ అవైస్, సౌద్ షకీల్, మహ్మద్ అబ్బాస్, సాజిద్ ఖాన్‌లకు కాంట్రాక్టులు కేటాయించారు.

అబ్రార్ అహ్మద్, అరాఫత్ మిన్హాస్, ఫఖర్ జమాన్, ఫహీమ్ అష్రఫ్, హారిస్ రవూఫ్, షాహీన్ అఫ్రిదిలకు వన్డే, టీ20 ఫార్మాట్లలో కాంట్రాక్టులు లభించాయి.

టీ20 కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌తో పాటు హసన్ నవాజ్, మాజ్ సదాకత్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ తారిక్‌లకు టీ20 కాంట్రాక్టులు దక్కాయి.

ADVERTISEMENT