Page Loader
Team India: డీఆర్ఎస్‌లో అవకతవకలు.. టీమిండియాపై మరోసారి విషం కక్కిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ 
టీమిండియాపై మరోసారి విషం కక్కిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్

Team India: డీఆర్ఎస్‌లో అవకతవకలు.. టీమిండియాపై మరోసారి విషం కక్కిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2023
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా మరోసారి విషం కక్కాడు. భారత జట్టు డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) నూ తారుమారు చేస్తోందని బాంబు పేల్చాడు. సౌతాఫ్రికా జట్టును టీమిండియా చిత్తుగా ఓడించిన తర్వాత రజా తన అసహనాన్ని ఇలా వెళ్లగక్కడం గమనార్హం. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతని బౌలింగ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ వాండెర్ డుసెస్ ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చిన విధానాన్ని హసన్ రజా తప్పుబట్టారు. లెఫ్టామ్ స్పిన్నర్ వేసిన లెగ్ స్టంప్‌పై పడి మళ్లీ ఆఫ్ స్టంప్‌కు ఎలా తగులుతుందని రాజా ప్రశ్నించాడు.

Details

ఇండియా బౌలర్లకు వేరే బంతిని ఇస్తున్నారు

ఇండియా బౌలర్లకు వేరే బంతి ఇస్తున్నారని, దానిని చెక్ చేయాలని హసన్ రజా పేర్కొన్నాడు. జడేజా ఐదు వికెట్ల తీసి అతని కెరీర్‌లో బెస్ట్ బౌలింగ్ చేశాడని, అయితే టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే డీఆర్ఎస్ విషయంలో అవకతవకలు జరిగాయని వెల్లడించారు. వాండెర్ డుసెన్ ఎల్బీడబ్ల్యూ విషయంలో బాల్ లెగ్ స్టంప్ పై పడి ఆఫ్ స్టంఫ్ కు తగులుతున్నట్లుగా చూపించారని, ఇది ఎలా సాధ్యమని, డీఆర్ఎస్ ను తారుమారు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని రజా అన్నాడు. పాకిస్థాన్ ఇదే సౌతాఫ్రికాతో ఆడినప్పుడు తబ్రేజ్ షంసీని నాటౌట్‌గా ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా రజా గుర్తు చేశాడు