ఆస్టన్ విల్లా చేతిలో చెల్సియా చిత్తు.. మేనేజర్ తొలగింపు
ప్రీమియర్ లీగ్‌లో చెల్సియా జట్టు నిరాశపరిచింది. శనివారం ఆస్టన్ విల్లా చేతిలో 2-0 తేడాతో చెల్సియా చిత్తుగా ఓడింది. దీంతో చెల్సియా మేనేజర్ గ్రాహం పోటర్ ఆ జట్టును నుంచి తప్పించారు. మాజీ బ్రైటన్ మేనేజర్ పోటర్ సెప్టెంబర్‌లో థామస్ తుచెల్ స్థానంలో చెల్సియాలో జట్టులో చేరిన విషయం తెలిసిందే. అతను జట్టును ముందుకు నడిపించడంలో విఫలమయ్యాడు. దీంతో చెల్సియా ప్రీమియర్ లీగ్ లో 11వ స్థానంలో ఉంది. అతని సారథ్యంలో చెల్సియా 32 మ్యాచ్‌లను ఆడింది. ఇందులో 12 విజయాలు, 11 ఓటములు, 11 డ్రా లు ఉన్నాయి. ఆస్టిన్ విల్లాపై ఓటమికి ముందు, చెల్సియా పోటీల్లో నాలుగు విజయాలతో అజేయంగా ఉంది.
తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బ్రూనో సాల్టర్
అయితే ఫిబ్రవరి (D2 L3)లో చెల్సియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. తిరిగి జనవరిలో చెల్సియా కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీనిపై చెల్సియా యాజమానులు టాడ్ బోహ్లీ, బెహ్దాద్ ఎగ్బాలీ మాట్లాడుతూ గ్రహం పట్ల కోచ్‌గా తమకు అత్యున్నత గౌరవం ఉందని, అతను వృత్తి పట్ల ఎంతో చిత్తుశుద్ధితో పనిచేశాడని, అయితే అస్టిన్ విల్లా చేతిలో ఓటమి పట్ట తామంతా నిరాశచెందామని చెప్పారు. బ్రైటన్‌లో పాటర్‌తో కలిసి పనిచేసిన బ్రూనో సాల్టర్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు.