ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. బ్యాటర్లలో స్మృతి ఐదో స్థానం
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లకు మెరుగైన స్థానాలు దక్కాయి. బ్యాటర్ల జాబితాలో టీమ్‌ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 743 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 64 బంతుల్లోనే 124 పరుగులు చేసి ఆకట్టుకుంది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ బెత్ మూనీ 785 పాయింట్లతో నంబర్‌వన్‌గా ఉంది. అదే దేశానికి చెందిన జార్జియా వోల్ 779 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్ట్ 771 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉండగా.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్ 754 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
వివరాలు
టాప్-10లో మరో ఇద్దరు భారత బ్యాటర్లు
భారత జట్టు బ్యాటర్లు షెఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
షెఫాలి వర్మ 715 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ 658 పాయింట్లతో పదో ర్యాంకులో నిలిచింది.
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 709 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
ఆల్‌రౌండర్ల జాబితాలోనూ దీప్తి సత్తా చాటింది. 365 పాయింట్లతో ఆమె ఐదో ర్యాంకును సొంతం చేసుకుంది.
దీంతో తాజా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల ప్రదర్శన మరోసారి స్పష్టమైంది.