LOADING...
Manish Pandey: ఐపీఎల్‌లో 4 వేల పరుగుల క్లబ్‌లోకి మనీష్ పాండే.. అరుదైన రికార్డ్
ఐపీఎల్‌లో 4 వేల పరుగుల క్లబ్‌లోకి మనీష్ పాండే.. అరుదైన రికార్డ్

Manish Pandey: ఐపీఎల్‌లో 4 వేల పరుగుల క్లబ్‌లోకి మనీష్ పాండే.. అరుదైన రికార్డ్

వ్రాసిన వారు Moogati Shabari
May 24, 2026
10:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) బ్యాటర్ మనీష్ పాండే అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 4,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన 13వ పరుగుతో ఈ ఘనత సాధించాడు. మనీష్ పాండే చేసిన ఐపీఎల్ పరుగుల్లో దాదాపు 1,500 పరుగులు కేకేఆర్ తరఫునే రావడం విశేషం. ఇప్పుడు అతని ఐపీఎల్ గణాంకాలు, రికార్డులపై ఓ లుక్కేద్దాం.

వివరాలు

తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డ్..

ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో గణాంకాల ప్రకారం.. మనీష్ పాండే 180 మ్యాచ్‌లు, 164 ఇన్నింగ్స్‌లలో 4,000 పరుగుల మార్క్‌ను దాటాడు. ఐపీఎల్‌లో అతని సగటు దాదాపు 30గా ఉండగా, స్ట్రైక్‌రేట్ 121కి పైగానే ఉంది. ఇప్పటివరకు అతని ఖాతాలో 22 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. 2009 ఐపీఎల్ సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై ఆర్సీబీ తరఫున అజేయంగా 114 పరుగులు చేసి, ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

వివరాలు

మనీష్ పాండే ప్రత్యేక రికార్డు..

ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో మనీష్ పాండే మరో ప్రత్యేక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి సీజన్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఇప్పటికే ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సరసన చేరాడు. కాగా, ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఎంఎస్ ధోనీ ఈ రికార్డును అందుకోలేకపోయాడు.

Advertisement