
Manoj Tiwary: రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మనోజ్ తివారి
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా క్రికెటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
ఈనెల 3వ తేదీన అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించగా, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని తివారి మంగళవారం విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. బెంగాల్ కోసం తిరిగి ఆడనున్నట్లు ప్రకటించాడు.
దీంతో మళ్లీ వచ్చే ఏడాది రంజీ ట్రోఫీలో బరిలోకి దిగనున్నారు. క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహసిన్ గంగూలీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకోవాలని మనోజ్‌ను అభ్యర్ధించినట్లు తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా బెంగాల్ జట్టులో కీలక ఆటగాడిగా తివారి కొనసాగుతున్నాడు. అతని సారథ్యంలో బెంగాల్ జట్టు గత రంజీ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Details
దేశవాళీ క్రికెట్లో తివారికి గొప్ప రికార్డు
ఇప్పటివరకూ టీమిండియా 12 వన్డే మ్యాచులు ఆడి 287 పరుగులు చేయగా, టీ20ల్లో కేవలం 3 మ్యాచులు, ఐపీఎల్‌లో 96 మ్యాచులను ఆడాడు.
దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అతడికి మంచి రికార్డు ఉంది. 141 మ్యాచుల్లో 48.56 సగటుతో 9,908 పరుగులు చేశాడు.
ఇందులో 39 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలను బాదాడు. 169 లిస్ట్ ఏ మ్యాచుల్లో 42.28 సగటుతో 5581 పరుగులు చేశాడు.
తివారీ గత రంజీ ట్రోఫీలో 10 మ్యాచ్‌ల్లో 33.78 సగటుతో 473 పరుగులు చేశాడు. అతను ఆరు అర్ధశతకాలు బాదాడు.