Manoj Tiwary Retires: అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన మనోజ్ తివారీ
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా బెంగాల్ క్రికెట్ సేవలందించిన తివారీ, 2015లో ఇండియా తరుపున చివరిసారిగా ఆడాడు. మనోజ్ తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. బెంగాల్‌లో మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా డొమెస్టిక్ క్రికెట్ ను ఆడుతూ వచ్చాడు. 2004-05 రంజీ ట్రోఫీలో క్రికెట్లోకి మనోజ్ తివారీ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 141 ఫస్ట్-క్లాస్ మ్యాచుల్లో 48.56 సగటుతో 9908 పరుగులు చేశాడు. ఇందులో 45 అర్ధ సెంచరీలు, 29 సెంచరీలను బాదాడు. 169 లిస్ట్ ఏ మ్యాచుల్లో 42.28 సగటుతో 5581 పరుగులు చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలున్నాయి.
టీమిండియా తరుపున 12 వన్డేలు ఆడిన మనోజ్ తివారీ
క్రికెట్ తనకు అన్నింటినీ ఇచ్చిందని, ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొంటున్న సమయం నుంచి క్రికెట్ తనకు అండగా నిలిచిందని, క్రికెట్‌కు ఆ దేవుడికి తాను ఎప్పుడు రుణపడి ఉంటానని మనోజ్ తివారీ ఇన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. ఇక తివారీ ఐపీఎల్ లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరుపున ఆడాడు. 2011లో యువరాజ్ స్థానంలో వెస్టిండీస్ టూరుకు ఎంపికైన తివారీ, విండీస్‌తో ఐదో వన్డేల్లో సెంచరీని బాదాడు. తర్వాత 14 మ్యాచుల పాటు అతను జట్టుకు దూరంగానే ఉన్నాడు. టీమిండియా తరుపున 12 వన్డే మ్యాచులు ఆడి 287 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో కేవలం మూడు మ్యాచులు మాత్రమే ఆడాడు.