తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Manu Bhaker : మనూ భాకర్ ఓటమి.. త్రుటిలో చేజారిన మూడో పతకం
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Aug 03, 2024 
                    
                     01:51 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు మరో పతకం త్రుటిలో చేజారింది. ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ షూటింగ్ ఫైనల్లో మనూ భాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. హోరాహోరీగా సాగిన పోరులో మనూ భాకర్ అద్భుతంగా రాణించినా 4వ స్థానంలో నిలవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. ఆమె ఒకవేళ టాప్ 3 లో ఉంటే పతకం వచ్చేది. ఇప్పటికే షూటింగ్‌లో ఆమె రెండు పతకాలను సాధించారు. 25 మీటర్ల ఫిస్టల్ షూటింగ్‌లో దక్షిణకొరియాకు చెందిన జె.ఐ యంగ్ 37 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.