Khel Ratna award: ఖేల్ రత్న అవార్డుకు మహిళా షూటర్ మను భాకర్, చెస్ గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
2024 సంవత్సరానికి గాను భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు మహిళా షూటర్ మను భాకర్,చెస్ గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ ఎంపికయ్యారు.
ఈ విషయాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ జనవరి 2న అధికారికంగా ప్రకటించింది.
ఖేల్ రత్న అవార్డుకు మొత్తం నలుగురు క్రీడాకారులను ఎంపిక చేశారు.
మను భాకర్,డి. గుకేశ్‌తో పాటు భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్,పారాలింపిక్స్ హై జంప్‌లో రజత పతకం సాధించిన ప్రవీణ్ కుమార్ కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
వివరాలు
32 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు
ఈ అవార్డును జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో,భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరికి ప్రదానం చేస్తారు.
అదనంగా, గత సంవత్సరంలో క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన 32 మంది క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో గౌరవించింది.
వివరాలు
అర్జున అవార్డులు వీరికే..
జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్)
అన్ను రాణి (అథ్లెటిక్స్)
నీతు (బాక్సింగ్)
సావీతీ (బాక్సింగ్)
వంతిక అగర్వాల్ (చెస్)
సలీమా (హాకీ)
అభిషేక్ (హాకీ)
సంజయ్ (హాకీ)
జర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
సుఖ్‌జీత్ సింగ్ (హాకీ)
స్వప్నిల్ సురేష్ కుసాలే (షూటింగ్)
సరబ్‌జోత్ సింగ్ (షూటింగ్)
అభయ్ సింగ్ (స్క్వాష్)
సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్)
అమన్ (రెజ్లింగ్)
రాకేశ్ కుమార్ (పారా ఆర్చర్)
ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్)
జీవాంజి దీప్పతి ((పారా అథ్లెటిక్స్)
అజీత్‌సింగ్ ((పారా అథ్లెటిక్స్)
సచిన్ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్)
ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్)
వివరాలు
అర్జున అవార్డులు వీరికే..
హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్)
సిమ్రాన్ (పారా అథ్లెటిక్స్)
నవ్‌దీప్ (పారా అథ్లెటిక్స్)
నితీశ్ కుమార్ (పారా బ్యాడ్మింటన్)
తులసీమతి మురుగేశన్ (పారా బ్యాడ్మింటన్)
నిత్య శ్రీ సుమతి శివన్ (పారా బ్యాడ్మింటన్)
మనీశా రాం దాస్ (పారా బ్యాడ్మింటన్)
కపిల్ పర్మార్ (పారా జుడో)
మోనా అగర్వాల్ (పారా షూటింగ్)
రుబినా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్)
అర్జున అవార్డ్స్ (లైఫ్‌టైమ్)
సుచా సింగ్ (అథ్లెటిక్స్)
మురళీకాంత్ రాజారాం పెట్కర్ (పారా స్విమ్మింగ్)
ద్రోణాచార్య అవార్డులు (కోచ్‌లు)
సుభాష్ రాణా (పారా షూటింగ్)
దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్)
సందీప్ సంగ్వాన్ (హాకీ)
లైఫ్‌టైం కేటగిరీలో..
మురళీధరన్ (బ్యాడ్మింటన్)
అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్)