Page Loader
Manu Bhaker :తమిళనాడు సీఎం ఎవరో తెలియదు.. వైరల్‌గా మారిన మను భాకర్ సమాధానం 
తమిళనాడు సీఎం ఎవరో తెలియదు

Manu Bhaker :తమిళనాడు సీఎం ఎవరో తెలియదు.. వైరల్‌గా మారిన మను భాకర్ సమాధానం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2024
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒలింపిక్ పతక విజేత భారత షూటర్ మను భాకర్ ప్రస్తుతం విరామంలో ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్ కు .. చెన్నైలోని ఓ పాఠశాలలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా, జరిగిన కార్యక్రమంలో,తమిళనాడు గురించి మనుబాకర్ కు ఎంత తెలుసో .. తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ అక్కడి జర్నలిస్టులు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు. మొదట మహాబలిపురం గురించి అడగగా దానికి మనబాకర్ తెలియదని చెప్పారు.మీనాక్షి టెంపుల్ గురించి అడిగినా దానికీ ఆమె తెలియదనే సమాధానం చెపింది.

వివరాలు 

మను సమాధానంతో జర్నలిస్టులకు మైండ్ బ్లాంక్

అనంతరం వారు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎవరో తెలుసా అంటూ ప్రశ్న అడిగారు.దానికి సమాధానంగా మను తలను అడ్డంగా ఊపినవ్వడం ప్రారంభించింది. దాంతో జర్నలిస్టులకు మైండ్ బ్లాంక్ అయ్యిపోయింది. కాగా, మనుకి స్టార్ హీరో విజయ్ తెలుసు అని చెప్పింది. దీని బట్టి చూస్తే .. మనుబాకర్ కు భక్తి, రాజకీయాల కంటే కూడా .. సినిమాలపై మాత్రం ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువేనని క్లారిటీ వచ్చేసినట్లయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్టాలిన్ పేరు విన్న సమయంలో మను రియాక్షన్