LOADING...
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్య సాధించిన మను భాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్య సాధించిన మను భాకర్

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్య సాధించిన మను భాకర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2024
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించింది. 20 ఏళ్ల తర్వాత మహిళల మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్ కు చేరిన మను భాకర్ మూడో స్థానంలో నిలిచింది. మను 221.7 పాయింట్లు గెలుచుకోగా తొలి స్థానాల్లో నిలిచిన దక్షిణా కొరియా ప్లేయర్లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ లభించాయి. కిమ్ యెజి 241.3 పాయింట్లతో వెండి పతకాలు సాధించారు. ఇక ఒలింపిక్ పతకాన్ని సాధించిన భారతదేశపు మొట్టమొదటి మహిళా షూటర్‌గా మను భాకర్ నిలిచింది

Details

షూటింగ్ లో మెడల్ గెలిచిన భారతీయులు వీరే

2017లో కేరళలో నిర్వహించిన జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో మను భాకర్ తొమ్మిది స్వర్ణాలు సాధించింది. ఏకంగా ఒలింపియన్, మాజీ ప్రపంచ నంబర్ 1 హీనా సిద్ధూను ఓడించింది. షూటింగ్ లో మెడల్ గెలిచిన భారతీయులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (సిల్వర్) 2004 అభినవ్ బింద్రా (గోల్డ్) 2008 విజయ్ కుమార్ (సిల్వర్) 2012 గగన్ నారంగ్ (బ్రాంజ్) 2012 మను భాకర్ (బ్రాంజ్)2024