IPL 2026: చెన్నైకి భారీ షాక్.. లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
లక్నో సూపర్జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ పోరులో లక్నో జట్టు అద్భుత ప్రదర్శన చేసి చెన్నైపై సూపర్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అయితే 188 పరుగుల లక్ష్యాన్ని లక్నో జట్టు మరో 20 బంతులు మిగిలి ఉండగానే సులభంగా చేజ్ చేసింది. చివరికి 7 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది.
వివరాలు
మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్..
లక్నో జట్టులో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అతను కేవలం 38 బంతుల్లోనే 90 పరుగులు చేసి 7 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. శతకం కొంచెం తేడాతో మిస్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇంగ్లిస్ 36 పరుగులు చేయడంతో పాటు ఇద్దరూ కలిసి 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో లక్నో జట్టు విజయానికి బలమైన పునాది పడింది.
వివరాలు
మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సిందే..
చివర్లో నికోలస్ పూరన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను లక్నో వైపు తిప్పేశాడు. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్..
Unstoppable 🔥🔥
— IndianPremierLeague (@IPL) May 15, 2026
Mitchell Marsh continues to deal in maximums tonight 🚀
Updates ▶️ https://t.co/v1R8RJXPe8#TATAIPL | #KhelBindaas | #LSGvCSK | @LucknowIPL pic.twitter.com/kMyIF5WAtQ