LOADING...
Dhoni cutout: నందిగామలో ధోనీ ఫ్యాన్స్‌ హంగామా.. 77 అడుగుల కటౌట్‌తో సెలబ్రేషన్స్
నందిగామలో ధోనీ ఫ్యాన్స్‌ హంగామా.. 77 అడుగుల కటౌట్‌తో సెలబ్రేషన్స్

Dhoni cutout: నందిగామలో ధోనీ ఫ్యాన్స్‌ హంగామా.. 77 అడుగుల కటౌట్‌తో సెలబ్రేషన్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్‌,'మిస్టర్‌ కూల్‌' మహేంద్ర సింగ్ ధోనీ 45వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీపై అభిమానుల అభిమానంలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ధోనీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో అభిమానులు 77 అడుగుల ఎత్తైన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

వివరాలు 

బీసీసీఐ ప్రత్యేక శుభాకాంక్షలు

ఈ విశాలమైన కటౌట్‌ స్థానికులతో పాటు అటుగా వెళ్లే వారినీ విశేషంగా ఆకర్షిస్తోంది. అభిమానులు కటౌట్‌ వద్ద ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా, ధోనీ 45వ పుట్టినరోజు సందర్భంగా బీసీసీఐ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన దిగ్గజంగా కొనియాడుతూ, "క్రికెట్ ఐకాన్" అంటూ ఎక్స్‌ వేదికగా ప్రత్యేక పోస్టు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ధోనీపై అభిమానుల ప్రేమ

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ధోనీ కి శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ

Advertisement