AUS Vs AFG : మాక్స్ వెల్ డబుల్ సెంచరీ.. ఆస్ట్రేలియా సంచలన విజయం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆప్ఘాన్‌పై ఆసీస్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ బ్యాటర్ మాక్స్‌వెల్ 128 బంతుల్లో 201 (21 ఫోర్లు, 10 సిక్సర్లు) పరుగులతో చేలరేగి ఆసీస్ జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ 129 శతకంలో చెలరేగి ఆఫ్గాన్ జట్టుకు భారీ స్కోరును అందించారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, జంపా, మాక్స్ వెల్, స్టార్క్ తలా ఓ వికెట్ తీశారు.
మాక్స్ వెల్ ఊచకోత
292 పరుగుల లక్ష్య చేధనకు దిగిన 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మాక్స్ వెల్ 201 మెరుపు డబుల్ సెంచరీతో ఆసీస్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టినా చివరి వరకూ క్రీజులో ఉండి ఒంటిచేత్తో మ్యాచును గెలిపించాడు.