Page Loader
Maxwell: మాక్స్‌వెల్‌ కీలక నిర్ణయం.. 13 ఏళ్ల వన్డే ప్రయాణానికి గుడ్ బై!
మాక్స్‌వెల్‌ కీలక నిర్ణయం.. 13 ఏళ్ల వన్డే ప్రయాణానికి గుడ్ బై!

Maxwell: మాక్స్‌వెల్‌ కీలక నిర్ణయం.. 13 ఏళ్ల వన్డే ప్రయాణానికి గుడ్ బై!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా ప్రముఖ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అభిమానులకు షాకిస్తూ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. సోమవారం అధికారికంగా వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 2012లో ఆస్ట్రేలియా తరఫున వన్డే అరంగేట్రం చేసిన మాక్స్‌వెల్‌.. దాదాపు 13 ఏళ్లపాటు ఈ ఫార్మాట్‌లో దూకుడుగా ఆడారు. మొత్తం 149 వన్డేల్లో పాల్గొన్న ఆయన దాదాపు 4,000 పరుగులు నమోదు చేశారు.

Details

వన్డే వరల్డ్ కప్ విజయాల్లో మాక్స్ వెల్ కీలక పాత్ర

2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌లలో ఆస్ట్రేలియా విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన వన్డే మ్యాచ్‌లలో మాక్స్‌వెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్స్‌వెల్.. వేలి గాయం కారణంగా ఈ సీజన్‌ మధ్యలోనే ఆటకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. దీంతో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేకపోయారు.