LOADING...
Maxwell vs Travis Head: మ్యాక్స్‌వెల్ vs హెడ్.. ఉప్పల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్ల మధ్య వాగ్వాదం!
మ్యాక్స్‌వెల్ vs హెడ్.. ఉప్పల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్ల మధ్య వాగ్వాదం!

Maxwell vs Travis Head: మ్యాక్స్‌వెల్ vs హెడ్.. ఉప్పల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్ల మధ్య వాగ్వాదం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు గ్రౌండ్‌పై ఎలాంటి హీట్ మూమెంట్స్ కనిపించలేదు. కానీ నిన్న రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో మాత్రం కొంచెం ఉద్వేగం కనిపించింది. అదీ కాకుండా ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్ల మధ్యే మైనర్ క్లాష్ చోటు చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ చక్కగా ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఘాటు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశారు. మొదటి వికెట్‌కు 171 పరుగులు జతచేస్తూ విజయం దిశగా బలమైన పునాది వేసారు.

Details

 అసహనం వ్యక్తం చేసిన హెడ్

అయితే తొమ్మిదో ఓవర్‌లో ట్రావిస్ హెడ్ - గ్లెన్ మ్యాక్స్‌వెల్ మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. మ్యాక్స్‌వెల్ వేసిన ఓవర్‌లో హెడ్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత ఒక బంతిని రక్షణాత్మకంగా ఆడగా, బంతి నేరుగా బౌలర్ చేతికి వెళ్లింది. కోపంగా ఉన్న మ్యాక్స్‌వెల్ ఆ బంతిని కీపర్ వైపు వేగంగా విసరడంతో హెడ్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటన అనంతరం ఇద్దరి మధ్య స్వల్ప తగాదా చోటు చేసుకుంది. నాన్-స్ట్రైక్ ఎండ్‌కు వెళ్తూ కూడా వాదనలు కొనసాగాయి. దాంతో వెంటనే మార్కస్ స్టాయినీస్ వచ్చి ట్రావిస్ హెడ్‌ను ప్రశాంతంగా ఉండమని సమాధానపరిచాడు.

Details

అంతా సరదాగా జరిగిందే : మ్యాక్స్‌వెల్

మ్యాక్స్‌వెల్ మాత్రం నిశ్శబ్దంగా దూరంగా వెళ్లిపోయాడు. ఇది ఐపీఎల్ 2025లో ఫీల్డ్‌పై జరిగిన తొలి హీట్ ఆర్గ్యుమెంట్ కావడం గమనార్హం. మ్యాచ్ తర్వాత ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ ఇది అంతా సరదాగా జరిగిందే. ఒకరిని మరొకరు బాగా తెలిసినప్పుడు, మనం కొంచెం ఎమోషనల్ అవుతాం. అలాంటిదే జరిగిందని చెప్పాడు. అయితే ఆ తరువాత హెడ్ 66 పరుగుల వద్ద గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేతికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు