Page Loader
MCC : బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర క్యాచ్‌ల‌ విష‌యంలో ఐసీసీ,ఎంసీసీలు కొత్త రూల్స్‌ 
బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర క్యాచ్‌ల‌ విష‌యంలో ఐసీసీ,ఎంసీసీలు కొత్త రూల్స్‌

MCC : బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర క్యాచ్‌ల‌ విష‌యంలో ఐసీసీ,ఎంసీసీలు కొత్త రూల్స్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

బౌండరీ లైన్ సమీపంలో జరుగుతున్న క్యాచ్‌ల విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సంయుక్తంగా కొత్త నిబంధనలను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 'బన్నీ హాఫ్ క్యాచ్‌లు' ఇకపై చెల్లుబాటు కాకపోవచ్చని సమాచారం. అంటే, బౌండరీ దాటి వెళ్లి, అక్కడ నుంచి బంతిని గాల్లోకి నెట్టి మళ్లీ క్యాచ్ పట్టే విధానానే క్యాచ్‌గానే ప‌రిగ‌ణించ‌నున్నారు.. అయితే.. బౌండ‌రీ లోప‌ల నుంచి బంతిని నెట్టి, ఆపై బ‌య‌టికి వెళ్లి, తిరిగి డైవ్ చేసి క్యాచ్‌ను అందుకుంటే మాత్రం దాన్ని క్యాచ్‌గానే ప‌రిగ‌ణించ‌నున్నారు.

వివరాలు 

మైఖేల్ నేసర్ క్యాచ్ ఉదాహరణగా… 

2023 బిగ్ బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ మైఖేల్ నేసర్ బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. బ్యాలెన్స్ కోల్పోతున్న సమయంలో ఆయన బంతిని గాల్లోకి విసిరి, తర్వాత బౌండరీ బయటకు వెళ్లాడు. అక్కడ గాల్లోకి ఎగిరి బంతిని మళ్లీ అందుకొని మైదానంలోకి నెట్టాడు. ఆపై మళ్లీ లోపలికి వచ్చి డైవ్ చేస్తూ క్యాచ్‌ను పూర్తి చేశాడు. ఈ అద్భుత క్యాచ్‌తో బ్యాటర్ ఔట్ అయ్యాడు కానీ, దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంసీసీ బన్నీ హాప్స్ క్యాచ్‌లను నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించింది.

వివరాలు 

హార్లీన్ డియోల్ క్యాచ్  

ఇకపై బౌండరీ లోపల నుంచే బంతిని గాల్లోకి నెట్టి, ఆటగాడు బౌండరీ బయటకు వెళ్లి మళ్లీ లోపలికి డైవ్ చేసి క్యాచ్ పట్టినట్లయితే, దాన్ని చెల్లుబాటు అయ్యే క్యాచ్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు, భారత మహిళా క్రికెటర్ హార్లీన్ డియోల్ పట్టిన అనూహ్య క్యాచ్ ఈ కొత్త నిబంధనకు అనుకూలంగా ఉంటుంది.

వివరాలు 

ఎంసీసీ స్పష్టత 

''బన్నీ హాప్స్ క్యాచ్‌లను ఇకపై అనుమతించం. కానీ బౌండరీ లోపల నుంచి బంతిని పైకి నెట్టి, బయటికి వెళ్లి,ఆపై డైవ్ చేసి క్యాచ్ పట్టేందుకు అనుమతి ఉంది.ఒకవేళ బంతిని వేరే ఫీల్డర్‌కు పంపినా లేదా మైదానంలోకి నెట్టినా.. ఫీల్డర్ బౌండరీ బయట ల్యాండ్ అయితే..లేదా ఆ తర్వాత బయటికి వెళితే..దాన్ని బౌండరీ కింద పరిగణిస్తారు.'అని ఎంసీసీ తెలిపింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం,బౌండరీ లైన్ దాటి బంతిని గాల్లోకి తాకేందుకు ఫీల్డర్‌కు ఒక్క అవకాశమే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ బౌండరీ బయటకు వెళ్లే అవకాశం ఉండదు. ఈ తాజా నిబంధనలను ఐసీసీ ఇప్పటికే జూన్ నెలలో అమలులోకి తీసుకురానుంది.ఇక,ఎంసీసీ మాత్రం 2025 అక్టోబర్ నుండి అధికారికంగా ఈ రూల్‌ను అమలు చేయనుంది.