LOADING...
Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్  
శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్

Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
08:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రాణంగా ప్రేమించిన ఆట‌లో నిల‌క‌డ‌గా రాణించిన యువ క్రికెట‌ర్‌కు అందుకు త‌గిన గౌర‌వం ద‌క్కింది. ఇప్పటి వరకు జట్టులో సభ్యుడిగా ఉన్న అతడు, ఇకపై నాయకుడిగా అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నాడు. అతడే మెహిదీ హసన్ మిరాజ్. తాజాగా మిరాజ్‌ను వన్డే జట్టుకు కెప్టెన్‌గా నియమించినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. మూడు ఫార్మాట్లలోనూ ఇటీవల కాలంలో అత్యుత్తమంగా ప్రదర్శన ఇస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మిరాజ్, ఈ పదవిని నజ్ముల్ హుసైన్ శాంటో నుంచి స్వీకరించబోతున్నాడు. అనుభవజ్ఞుల్ని పక్కనబెట్టి ఈ యువ ఆల్‌రౌండర్‌కి నాయకత్వ బాధ్యతలు అప్పగించడాన్ని బంగ్లా క్రికెట్‌లో ఒక విప్లవాత్మక నిర్ణయంగా పరిగణించవచ్చు.

వివరాలు 

భార‌త్‌పై మెరుపు సెంచ‌రీతో.. 

వచ్చే ఏడాది కాలం పాటు మిరాజ్ వన్డే కెప్టెన్‌గా కొనసాగుతాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. "గత కొన్ని సీజన్లుగా మిరాజ్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు.బ్యాట్‌తో,బంతితో సమపాళ్లలో మెరిసి జట్టుకు నూతన ఉత్సాహాన్ని అందిస్తున్నాడు. తన ఆటతీరుతో ఇతరులకూ స్ఫూర్తినిస్తోంది. అందుకే వన్డే కెప్టెన్సీ బాధ్యత అతనికే ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది" అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ సభ్యుడు నజ్ముల్ అబెదీన్ తెలిపారు. ఇప్పటికి రెండు సంవత్సరాల క్రితం భారత్‌పై ఆడిన మెరుపు సెంచరీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మిరాజ్,ఆ తరువాత కూడా కొన్ని మరిచిపోలేని ఇన్నింగ్స్‌లు ఆడి అభిమానులను అలరించాడు. గతంలో నాలుగు వన్డే మ్యాచ్‌ల్లో తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా ఇప్పుడు అతడికి మేలు చేసింది.

వివరాలు 

జూలైలో శ్రీలంక పర్యటన

శాంటో గైర్హాజరులో జట్టుని విజయవంతంగా నడిపించిన అతని నాయకత్వ ప్రతిభను అప్పుడే బోర్డు గుర్తించింది. ఇప్పుడు మిరాజ్‌కి కెప్టెన్‌గా తొలి సవాలు జూలైలో శ్రీలంక పర్యటనతో ఎదురుకానుంది. ఇప్పటి వరకు అతడు ఆడిన 105 వన్డేల్లో మొత్తం 1,617 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఐసీసీ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మిరాజ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్