Padma Awards: భారత క్రికెట్‌కు చిరస్మరణీయ సేవలు.. రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను శనివారం (జనవరి 25) అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో 113 మందికి పద్మశ్రీ, 13 మందికి పద్మభూషణ్, ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి. క్రీడారంగానికి చెందిన వ్యక్తుల్లో మొత్తం ఎనిమిది మంది ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్‌కు అత్యున్నతమైన పద్మవిభూషణ్ అవార్డు దక్కింది.
Details
హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ
అలాగే భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్, భారత సీనియర్ మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ సవిత పూనియా లతో పాటు బల్దేవ్ సింగ్, భగవాన్‌దాస్ రైక్వార్, కే. పజనివేల్‌కు పద్మశ్రీ అవార్డులు వరించాయి. క్రీడా రంగంలో విశేష సేవలు అందించినందుకు ఈ అవార్డులు లభించడం గర్వకారణమని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.