పారిస్ సెంయిట్- జెర్మెయిన్ జట్టు థ్రిలింగ్ విక్టరీ
సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా రోనాల్డ్, మెస్సీ తలపడ్డారు. రియాజ్ సీజన్, పారిస్ సెంయిట్- జెర్మెయిన్ టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. పీఎస్జీ తరుపున మెస్సీ, రియాద్ సీజన్ తరుపున రొనాల్డ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో చివరికి 5-4 తేడాతో పారిస్ సెయింట్-జెర్మెయిన్ విజయం సాధించింది. అదేవిధంగా ఫుట్‌బాల్ సూపర్ స్టార్లు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో స్కోర్‌షీట్‌లోకి ప్రవేశించారు. ఇక మెస్సీ, నెయ్‌మర్, కైలియన్ ఎంబాపెలు పారిస్ సెయింట్స్ జర్మన్(పీఎస్‌జీ)కి ఆడారు. PSGకి మెస్సీ మూడో నిమిషంలో ఆధిక్యం సాధించగా.. సౌదీలో తన మొదటి గేమ్‌ను ఆడుతున్న రొనాల్డో రెండు గోల్స్ చేసి దుమ్ములేపాడు.
అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ఆటగాడిగా రోనాల్డ్
రొనాల్డో అత్యధిక పారితోషికం పొందిన ఫుట్‌బాల్ ఆటగాడు చరిత్రకెక్కాడు. అల్-నాస్ర్‌తో రెండున్నర సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసిన రోనాల్డ్ వారానికి $1 మిలియన్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఈ ఒప్పందం 2025 వరకు కొనసాగనుంది. రోనాల్డో మాంచెస్టర్ యునైటెడ్‌లో వారానికి $605,000 సంపాదిస్తున్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలో ఇదే అతిపెద్ద జీతం కావడం విశేషం ఇటీవలే వివాదాస్పద రీతిలో మాంచెస్టర్ యునైటెడ్‌ను వీడిన క్రిస్టియానో రొనాల్డో.. సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అయిన అల్-నసర్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మెస్సీ తన రెండవ గోల్డెన్ బాల్ అవార్డును FIFA వరల్డ్ కప్ 2022లో గెలుచుకున్నాడు. అనేకసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్లను గెలుచుకున్న ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు.