Lionel Messi: డిసెంబర్ 13న హైదరాబాద్‌కు మెస్సీ.. ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌తో సీఎం రేవంత్ రెడ్డి!
ఈ వార్తాకథనం ఏంటి
అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ ప్రత్యేక పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు రానున్న మెస్సీ, సీఎం రేవంత్‌ను వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశముందని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. మెస్సీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు హైదరాబాద్ టూర్ వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా పర్యటన పోస్టర్‌ను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా 'తెలంగాణ రైజింగ్ 2047' సంకల్పంలో భాగంగా, మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించడానికి ప్రభుత్వం యోచనలో ఉందని సమాచారం.
Details
ప్రాక్టీస్ ఫోటోలు వైరల్
ఇక మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం నుండి నేరుగా MCHRDకు వెళ్లి సుమారు గంటపాటు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. ప్రాక్టీస్ చేస్తున్న సీఎం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెస్సీ హైదరాబాద్ పర్యటన నగరానికి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించనుంది. ముఖ్యంగా మెస్సీతో సీఎం భేటీ, ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు, బ్రాండ్ అంబాసడర్ ప్రతిపాదన వంటి అంశాలు తెలంగాణకు గ్లోబల్ స్థాయిలో కొత్త అవకాశాలు తెరచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.