Page Loader
మార్కెట్లో అత్యంత శక్తివంతమైన కారుగా MG సైబర్‌స్టర్
కొత్త ఫీచర్స్‌తో మార్కెట్ లోకి రానున్న MG సైబర్ స్టర్

మార్కెట్లో అత్యంత శక్తివంతమైన కారుగా MG సైబర్‌స్టర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2023
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటిష్ వాహన తయారీ సంస్థ మరో శక్తివంతమైన కారును రూపొందించింది. MG సైబర్‌స్టర్ కారును ప్రపంచ మార్కెట్లోకి పరిచయం చేయడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ కారు గరిష్టంగా 543hp పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇది యోక్ లాంటి స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉండడం దీని ప్రత్యేకత. అదే సమయంలో స్టైల్ పరంగా ఈ కారులో ఫీచర్లు చాలా భిన్నంగా ఉంటాయి. అనేక వాహన తయారీదారుల సంస్థలు రాబోయే దశాబ్దం నాటికి పూర్తిగా ఎలక్ట్రికల్ కార్లగా మార్చాలని యోచిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ MG మోటార్ ఇటీవలి సంవత్సరాలలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ముందంజలో ఉంది.

కారు

ఒక్కసారి ఛార్జీ చేస్తే 800 కిలోమీటర్లు

ఈ కారు బాణం ఆకారపు టెయిల్‌లైట్లతో ఆకర్షణీయంగా ఉంది. ప్రత్యేకంగా స్వెప్‌బ్యాక్ LED హెడ్‌ల్యాంప్‌లు, విస్తృత ఎయిర్ డ్యామ్, ఒక అగ్రెసివ్ ఫ్రంట్ ఎయిర్ స్ప్లిటర్, కత్తెర-శైలి తలుపులు, ORVMలు, స్వూపింగ్ బెల్ట్‌లైన్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, డిజైనర్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. రాబోయే MG సైబర్‌స్టర్ EV యొక్క సాంకేతిక వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇది 4,535mm పొడవు ఉంటుంది. డ్రైవర్ వైపు ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌ల ద్వారా ప్రయాణీకుల భద్రతను మరింత పెంచింది. ఈ కారు పొడవు 4,535mm, వెడల్పు 1,913mm, ఎత్తు 1,329mm, బరువు 1,850 కేజీలు ఉండనుంది. దీన్ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 800 కిలోమీటర్లు వస్తుంది.