Audi Q3: ఆడి కార్ల ధరలు పెంపు; సవరించిన రేట్లు మే 1నుంచి అమలు
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీ వాహన తయారీ సంస్థ ఆడి మే 1 నుంచి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలను 1.6 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
కస్టమ్స్ సుంకం, ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ధరలను పెంచినట్లు ఆడి పేర్కొంది.
ఇండియా మార్కెట్లో తాము కస్టమర్‌లకు ఉత్తమమైన వాటిని అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు.
కస్టమ్స్ డ్యూటీ, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల మా ధరలను సవరించాల్సి వచ్చిందిని వెల్లడించారు.
ధర
ఇప్పటికే ధరలను సవరించిన మెర్సీడెజ్, మారుతి సుజుకీ
ఇప్పటికే క్యూ8 సెలబ్రేషన్, ఆర్‌ఎస్5, ఎస్5 ధరలను ఏప్రిల్ 1 నుంచి 2.4 శాతం వరకు పెంచినట్లు ఆడి కంపెనీ చెప్పింది.
పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను, ముఖ్యంగా విదేశీ మారకపు కదలికల ప్రతికూల ప్రభావాన్ని పూడ్చేందుకు, ఏప్రిల్ 1 నుంచి వివిధ మోడళ్లలో రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ధరలను పెంచినట్లు మెర్సీడెజ్ బెంజ్ ఇండియా వెల్లడించింది.
అదేవిధంగా, మారుతి సుజుకీ ఏప్రిల్ 1 నుంచి అన్ని మోడళ్లలో ధరల పెంపును ప్రకటించింది. దీంతో మారుతి సుజుకీ డిజైర్, మారుతి సుజుకీ వ్యాగన్ఆర్, మారుతి సుజుకీ స్విఫ్ట్ ధరలు పెరిగాయి.