Page Loader
వన్డేలో న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెస్‌వెల్ అరుదైన రికార్డు
వన్డేలో రెండో శతకం సాధించిన బ్రాస్‌వెల్

వన్డేలో న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెస్‌వెల్ అరుదైన రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2023
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే భారత్ అభిమానులకు మాజాను ఇచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఒకానొక దశలో టీమిండియాకు న్యూజిలాండ్ బ్యాటర్ మైఖేల్ బ్రెస్‌వేల్ చెమటలు పట్టించాడు. కేవలం 78 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 పరుగులు చేశారు. శార్ధుల్ ఠాకూర్ అద్భుతమైన బంతితో బ్రెస్‌వెల్‌‌ను పెవిలియన్‌కు పంపండంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. 350 పరుగుల ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 28.4 ఓవర్లలో 131పరుగ చేసి 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బ్రేస్‌వెల్ ఫోర్లు, సిక్సర్లతో టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు.

బ్రాస్‌వెల్

57 బంతుల్లో సెంచరీ చేసిన బ్రాస్‌వెల్

న్యూజిలాండ్ తరఫున మూడో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా బ్రాస్‌వెల్ రికార్డు సృష్టించాడు. అతను 57 బంతుల్లో ఈ ఘనతను సాధించాడు.. 2007లో ఆస్ట్రేలియాపై 67 బంతుల్లో శతకం సాధించిన క్రెయిగ్ మెక్‌మిలన్ రికార్డును బ్రాస్‌వెల్ బద్దలు కొట్టాడు. ఛేజింగ్‌లో ఏడు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా బ్రాస్‌వెల్ రికార్డులకెక్కాడు. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి అద్భుతమైన సెంచరీ సాధించాడు