Page Loader
బౌండరీ లైన్ బయట క్యాచ్ పట్టినా ఔటిచ్చారు.. ఎందుకు..?
మైకేల్ నెసెర్ అద్భుతమైన క్యాచ్

బౌండరీ లైన్ బయట క్యాచ్ పట్టినా ఔటిచ్చారు.. ఎందుకు..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2023
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

బౌండరీ లైన్ బయట క్యాచ్ పడితే అది సిక్సర్ అవుతుంది. అయితే బౌండరీ లైన్ బయట క్యాచ్‌ను ఔటిచ్చారు అంపైర్లు.. బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ఫీల్డర్ పట్టిన క్యాచ్ చర్చనీయాంశమైంది. టీ20 వచ్చిన తరువాత బౌండరీల దగ్గర ఫీల్డర్లు ఎన్నో విన్యాసాలు చేసి క్యాచ్‌లు పడుతుంటారు. కచ్చితంగా సిక్స్ వెళుతుందని అనుకునేలోపే ఫీల్డర్ గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్సేన్‌హీట్, సిడ్నీసిక్సర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మైకేల్ నెసెర్ కళ్లు చెదిరి క్యాచ్‌ను అందుకున్నాడు. బౌండరీ లైన్ బయటకెళ్లి మైకేల్ క్యాచ్ పట్టాడు. అయితే దీన్ని ఔట్‌గా ప్రకటించారు అంపైర్లు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

మైకేల్ నెసెర్

మైకేల్ నెసెర్ కళ్లు చెదిరే క్యాచ్

బౌండరీ లైన్ లో ఉన్న నెసర్ బంతిని అందుకున్నాడు. కానీ బౌండరీ లైన్ బయటకు వెళుతోందని మళ్లీ బంతిని గాల్లోకి ఎగురుతూ క్యాచ్ పట్టుకున్నాడు. మళ్లీ నేలపై కాళ్లు పెట్టేలోపు బంతిని మళ్లీ గాల్లోకి విసిరాడు. అనంతరం బౌండరీలైన్ లోపలికి వచ్చి బంతిని అందుకున్నాడు. దీంతో దీన్ని అంపేర్లు ఔట్ గా ప్రకటించారు. రిప్లేల్లో ఈ వీడియోని స్పష్టంగా చూసిన తర్వాత ఎందుకు ఔటిచ్చారో తెలిసిపోయింది. నెసర్ బౌండరీ లైన్ బయట క్యాచ్ అందుకున్నా కూడా బంతి తన చేతుల్లో ఉన్నప్పుడు అతని కాళ్లు నేలపై లేవు. గాల్లోకి ఎగిరి అందుకుంటూ మళ్లీ గ్రౌండ్‌పై కాలు పెట్టేలోపు గాల్లోకి విసిరాడు. అయితే క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది ఔట్ అని అంపైర్లు నిర్ధారించారు.